16-08-2025 09:14:20 PM
ఇసుక మేటలను చూసి రైతులు బోరుమంటున్న రైతులు
జలదిగ్బంధంలో రైతు వేదిక
రోడ్లపై పారుతున్న నీరు ప్రవాహానికి రోడ్లపై గుంతలు
మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండలంలో వరి నాట్లు వేసి నెల రోజులు అవుతుంది మండలంలో పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్న సమయంలో మూడు రోజులుగా భారీ వర్షాలు రావడంతో పచ్చని పొలాల్లో ఎటుచూసినా ఇసుక మేటలు, రాళ్లు రప్పలు దర్శనమిస్తున్నాయి. రూ.లక్షల పెట్టుబడులు పెట్టిన పంట పొలాలు, ఇప్పుడు కనీసం ఆనవాళ్లు లేకుండా ఎడారిని తలపిస్తున్నాయి. సుమారు 3అడుగుల మేర వేసిన ఇసుక మేటలు, రైతుల గుండెల్ని పిండేస్తున్నాయి. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల రైతుల వేదన వర్ణనాతీతంగా మారింది.
ములుగు జిల్లా పలు మండలాల్లోని పెద్ద ఎత్తున పంట పొలాలు కోతకు గురయ్యాయి. పచ్చని పొలాల్లో 3అడుగుల మేర ఇసుక మేటలు ఉద్ధృతికి వందల ఎకరాల్లో ఇసుక మేటలు కప్పాయి. 1ఎకరా వరి సాగుకు ఇప్పటికే రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. వరద ధాటికి ఇప్పటికే పెట్టుబడులు పోగా, పంట చేలలో సుమారు 3అడుగుల మేర వేసిన ఇసుక మేటలను చూసి రైతులు బోరుమంటున్నారు. పొలంలో ఇసుక మేటలు తొలగించడంతో పాటు చదును చేసేందుకు నాణ్యమైన మట్టి పోయాల్సి ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 50 వేల రూపాయల వరకు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
భారీ వర నెలకొంది 50 ఎకరాల వరకూ పంట నష్టం ఏర్పండింది
మంగపేట మండలంలోని తిమ్మంపేట రైతులు సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టామన్నారు. చివరకు పురుగుల మందే మాకు దిక్కాని కుమ్మరి వెంకన్న, సల్లూరి నర్సయ్య, సల్లూరు సమ్మయ్య అనే రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వ సాయం చేయాలని కోరారు
జలదిగ్బంధంలో రైతు వేదిక-పొంచి ఉన్న ప్రమాదం
కురిసిన భారీ వర్షాలకు మంగపేట మండల కేంద్రంలోని రైతు వేదిక, చుట్టూ ఉన్న ఇండ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి రోడ్లపై పారె నీటి ప్రవాహానికి గుంతలు ఏర్పడి ప్రమాదాలకు ప్రతీకగా నిలిచాయి. వచ్చి పోయే వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.