calender_icon.png 16 August, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం వికటించి వివాహిత మృతి

16-08-2025 09:16:08 PM

తుంగతుర్తి సాయి బాలాజీ జనరల్ హాస్పిటల్ కు కడుపు నొప్పితో విజేత రాగా..

అబార్షన్ చేసిన ఆర్ఎంపి బండి శ్రీనివాస్... వైనం

ప్రభుత్వ నియమ నిబంధనలకు.. ప్రవేట్ హాస్పిటల్ తూట్లు

విజేత.. రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బయగళ్ల విజేత(25) వైద్యం వికటించి మృతిచెందిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ జనరల్ హాస్పిటల్ యజమాని ఆర్ఎంపి బండి శ్రీనివాస్ దవాఖానకు మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన భయాగుల్ల విజేత శ్రీనుతో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు 5 నెలలో కడుపునొప్పి రాగా, తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆర్ఎంపి బండి శ్రీనివాస్ పిండం అడ్డం తిరిగినట్లు, 25 వేల రూపాయలు తీసుకుని అబార్షన్ చేశాడు. దీనితో రక్తస్రావం జరిగింది.

మెరుగైన వైద్యం కోసం శుక్రవారం సాయంత్రం ఖమ్మం ప్రైవేట్ దవాఖానికి తరలించగా, చికిత్స పొందుతూ విజేత శనివారం మృతి చెందింది తక్షణమే అక్కడినుండి ఆర్ఎంపి శ్రీనివాస్ పలాయనం చెందాడు. దీనితో మృతికి కారకుడు నిర్లక్ష్యం వహించిన, ఆర్ఎంపి శ్రీనివాసని, పోలీస్ స్టేషన్లో భర్త శ్రీను, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని సాయి బాలాజీ దవాఖాన ముందు పెట్టి ,కుటుంబ సభ్యులు, న్యాయం చేయాలని, నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ప్రవేట్ దవాఖాన యజమాని బండి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. స్థానిక తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ ఫిర్యాదును స్వీకరించి, విచారణ జరిపి, పోస్టుమార్టం చేయించి, చట్టపైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.