calender_icon.png 16 August, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 53 మిల్లీ మీటర్ల వర్షపాతం

16-08-2025 09:13:16 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District)లో శుక్రవారం అర్దరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి జిల్లాలోని పలు కాలనీలు, గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగాయి. జిల్లా వ్యాప్తంగా 53 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జన్నారం మండలంలో 54.2 మిల్లీ మీటర్లు, దండేపల్లిలో 32.8 మిల్లీ మీటర్లు, లక్షెట్టిపేటలో 56.7 మిల్లీ మీటర్లు, హాజీపూర్ లో 44.4 మిల్లీ మీటర్లు, కాసిపేటలో 52.1 మిల్లీ మీటర్లు, తాండూరులో 15.8 మిల్లీ మీటర్లు, భీమినిలో 9.7 మిల్లీ మీటర్లు, కన్నెపల్లిలో 31.5 మిల్లీ మీటర్లు, వేమనపల్లిలో 84.5 మిల్లీ మీటర్లు, నెన్నెలలో 74.9 మిల్లీ మీటర్లు, బెల్లంపల్లిలో 40.5 మిల్లీ మీటర్లు, మందమర్రిలో 52.1 మిల్లీ మీటర్లు, మంచిర్యాలలో 38.2 మిల్లీ మీటర్లు, నస్పూర్ లో 38.4 మిల్లీ మీటర్లు, జైపూర్ లో 61.1 మిల్లీ మీటర్లు, భీమారంలో 54.3 మిల్లీ మీటర్లు, చెన్నూర్ లో 74.3 మిల్లీ మీటర్లు, కోటపల్లి మండలంలో 98.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్ నుంచి నేటి వరకు జిల్లాలో 626.2 మిల్లీ మీటర్ల వర్షం కురియాల్సి ఉండగా 536.5 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. అంటే ఇంకా 14 శాతం లోటు వర్షపాతమే నమోదైంది.