calender_icon.png 3 August, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ ప్రధాన రోడ్డుపై గుంతలు

01-08-2025 12:40:57 AM

ఇబ్బందుల్లో వాహనదారులు

సిర్గాపూర్, జులై 31 : సిర్గాపూర్ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎస్సార్ పెట్రోల్ పంపు నుంచి ఎంపీడీఓ కార్యాలయం వెళ్లే రోడ్డులో మోకాలి లోతు గుంతలు పడ్డాయి. గత నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి గుంతల్లో నీళ్లు చేరి చెరువులను తలిపిస్తున్నాయి. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డులో గుంతలు పూడ్చి రోడ్డును మరమ్మతు చేయాలని స్థానికులు, వాహనదారులుకోరుతున్నారు.