calender_icon.png 29 July, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ఇంకా మొదలుకాలేదు

29-07-2025 01:16:04 AM

  1. రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన
  2. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాం తి): బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ఇంకా ఏపీ ప్రభుత్వం చేపట్టలేదని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం  కీలక ప్రకటన చేసింది. ఈ అం శాన్ని కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ప్రస్తావించారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స మాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీ నిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి రాజ్‌భూషణ్ చౌదరి సమాధానాలు ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టును ఇంకా చేపట్టలేదని, దీనికి సం బంధించి ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకువచ్చిందని, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సై తం తమకు అందజేసిందని స్పష్టం చేశా రు.

వీటితోపాటు ఇప్పటికే తెలంగాణ సై తం బనకచర్లపై అభ్యంతరం చెబుతూ లేఖ  రాసిందని వివరించారు. బనకచర్ల ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంచనా కోసం తగిన ప్రక్రియను అనుసరిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారులు, పరివాహక రాష్ట్రాలతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.