calender_icon.png 23 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్..

22-10-2025 06:43:45 PM

కోనరావుపేట (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్కు వచ్చిన స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు ఎస్ఐ కె. ప్రశాంత్ రెడ్డి, పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, పోలీస్ శాఖలో సాంకేతిక వినియోగం, స్టేషన్ పరిసరాలు, పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు, 100 డైయల్ వినియోగం, సమాజంలో మంచి పౌరుడికి ఉండవలసిన లక్షణాలు వంటి వాటిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.