17 April, 2026 | 3:46 PM

Breaking News

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •  

రెండో రోజూ సిట్ విచారణకు ప్రభాకర్‌రావు

12-06-2025 01:52 AM

- హార్డ్ డిస్క్‌ల ధ్వంసంపై అధికారుల ఆరా!

- వ్యక్తిగత సెల్‌ఫోన్ స్వాధీనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బుధవారం రెండో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన వ్యక్తిగత సెల్ ఫోన్‌లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది.

ఆయనను కీలక సమాచారం, హార్డ్ డిస్క్‌ల ధ్వంసంపై సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఎస్‌ఐబీకి చెందిన కీలక హార్డ్ డిస్క్‌లు, గోప్య సమాచారాన్ని మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సిట్ అధికారులు మొదటి రోజు కూడా ప్రభాకర్‌రావును తీవ్రంగా విచారించారు.

రెండో రోజు కూడా ఈ డాటా ధ్వంసంపైనే అధిక సమయం ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను ప్రభాకర్‌రావు ముందు పెట్టి అధికారులు విచారణ చేస్తున్నారు. వారి వాంగ్మూలాల్లోని అస్థిరతలను సరిచూసుకుంటూ, ఈ కేసులోని పూర్తి కుట్రను ఛేదించే దిశగా సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.