26-10-2025 12:59:07 AM
యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా ‘డ్యూడ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. మమిత బైజు నటించగా, శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. దీపావళి సందర్భంగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తూ ఇటీవలే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ బ్లాక్‌బస్టర్ 100 కోట్ల జర్నీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “సినిమాల విషయానికొస్తే.. తెలుగు తమిళ్ ఒకే స్టేట్. తమిళ్ స్టార్స్ కూడా మా స్టార్స్‌గానే ఫీల్ అవుతాం. కమల్‌హాసన్, రజినీకాంత్, సూర్య, అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి.. ఇలా ఎవరొచ్చినా మా సొంత సినిమాలానే ప్రేమిస్తాం. ప్రదీప్ కూడా ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్‌లో జాయిన్ అయ్యారు. మూడుసార్లు ఇండస్ట్రీని షేక్ చేసి వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చారు.
ప్రదీప్ కేవలం హీరో మెటీరియల్ కాదు.. యాక్టర్ మెటీరియల్, స్టార్ మెటీరియల్. ప్రదీప్ ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. “డ్యూడ్ సినిమా 100 కోట్లు కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. ఆడియన్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అందరికీ కృతజ్ఞతలు” అన్నారు. హీరోయిన్ మమిత బైజు మాట్లాడుతూ.. “ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేసింది.
ఇది మరింత స్పెషల్ మూమెంట్. ఇంత ప్రేమనిచ్చిన తెలుగు ఆడియన్స్‌కి థాంక్యూ” అన్నారు. డైరెక్టర్ కీర్తీశ్వర్ మాట్లాడుతూ.. “ప్రదీప్ రంగనాథన్‌కి ఇది హ్యాట్రిక్ మూవీ. ఇది నా ఫస్ట్ సినిమా. ఇలాంటి కొలబరేషన్‌లో అద్భుతమైన విజయం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు. ‘డ్యూడ్ సినిమా సక్సెస్ చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో పనిచేసిన అందరూ మాకు చాలా మెమొరబుల్ ఫిల్మ్ ఇచ్చారు’ అని నిర్మాత వై రవిశంకర్ తెలిపారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, రైటర్ కృష్ణ, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.