calender_icon.png 1 February, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి

31-01-2026 07:31:00 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో సీపీఐ, సీపీఎం నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీపీఐ, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం అభ్యర్థులు 5, 10, 17, 18 వార్డుల్లో పోటీ చేస్తున్నారని, వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో సీపీఐ నాయకులు బోయిరె ప్రకాష్, పిప్పిరి వెంకటేష్, సీపీఎం నాయకులు గొడిసెల కార్తిక్, వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.