calender_icon.png 22 September, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి

22-09-2025 07:14:45 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని  వరి పంటలను మండల వ్యవసాయ అధికారి రాజలింగం రైతుల తో కలిసి సోమవారం పరిశీలించారు.పంట పరిశీలన అనంతరం మండల వ్యవసాయ అధికారి రాజలింగం మాట్లాడుతూ... ప్రస్తుతం వరి లో మోగిపురుగును,మెడవిరుపు  వరి లో ఎండు తెగులును గమనించడం జరిగింది.

మోగిపురుగు నివారణకు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50EC 400గ్రాములు లేదా క్లోరంటనిలిప్రోల్ 60ml ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్కోవాలని, మెడవిరుపు నివారణకు అజాక్సిస్ట్రోబిన్+టేబుకొనజోల్ 300ml ఎకరానికి లేదా పైరక్సి స్ట్రోబిన్+ ట్రై సైక్లోజల్ 250ml/200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది.వరి ఎండు తెగులుకు ప్లాంట మైసిన్ 80ml+కాపార్ ఆక్సీ క్లోరైడ్ 600గ్రాములు లేదా అగ్రి మైసిన్ 80ml+కాపార్ ఆక్సీ క్లోరైడ్ 600ml ను ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలియజేశారు. రైతులు నత్రజని సంబంధిత ఎరువులను తగ్గించి వాడాలని ప్రత్యేకంగా తెలిపారు.