22-09-2025 07:23:31 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బంది సోమవారం వేతనాలు చెల్లించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. గత నాలుగు నెలల నుండి తమకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు అందాల్సిన వేతనాలు చెల్లించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ట్రేడ్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఓం నారాయణ, శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బంది అనిల్, వెంకటస్వామి, చంద్రమౌళి, అన్వర్, సాయి తదితరులు పాల్గొన్నారు.