calender_icon.png 22 September, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీను జయప్రదం చేయండి

22-09-2025 07:39:07 PM

మఠంపల్లి: ఛలో హుజూర్ నగర్ లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీను జయప్రదం చేయాలని మఠంపల్లి మండల లంబాడీ జెఏసి నాయకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా మఠంపల్లి మండల కేంద్రంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కోయ, గోండు నాయకులు అయినా సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబాడీ సామాజిక వర్గంపై చేస్తున్నా విష ప్రచారాన్ని ఖండిస్తూ ఎస్టీ జాబితా నుండి లంబాడీ జాతిని తీసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, లంబాడీల జోలికి వస్తే ఊరుకునేది లేదని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు లంబాడీ జాతిపై విష ప్రచారం చేస్తున్నారని అందులో భాగంగానే సెప్టెంబర్ 26వ తారీఖున నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని తండాల నుంచి సుమారు 20 వేల మందితో లంబాడీల సత్తా చూపించబోతున్నామని లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు కుల సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగస్తులు, మహిళలు, భారీ ఎత్తున లంబాడీ సోదరులు పాల్గొని హుజూర్ నగర్ గర్ గడ్డ దద్దరిల్లే విధంగా భారీ ర్యాలీని నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల లంబాడీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.