calender_icon.png 22 September, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారుణం.. కూర వేయనందుకు గొడ్డలితో దాడి

22-09-2025 07:14:00 PM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా(Khammam District)లోని ఖానాపురంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కిటికీలు తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో తనతో పాటు పని చేస్తున్న మహిళా కూలీని ఓ వ్యక్తి గొడ్డలితో నరికిన ఘటన కలకలం రేపింది. కాగా, కార్మికులందరూ కలిసి భోజనం చేస్తుండగా మహిళా కూలీని కూర అడిగిన కార్మికుడు.. తన వరకు మాత్రమే ఉందని చెప్పడంతో ఆగ్రహానికి గురై మహిళా కూలీ రుక్మిణి మెడపై రవి గొడ్డలితో నరికాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే రుక్మిణిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు రవిపై ఖమ్మం అర్బన్ పీఎస్ లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.