calender_icon.png 27 December, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సీరియస్

27-12-2025 03:50:20 PM

  1. శివాజీ మాట్లాడింది తప్పు.  
  2. సినిమాలు చూడటం మానేయండి.

హైదరాబాద్: నటుడు శివాజీ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) స్పందించారు. మహిళల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలు(Sivaji comments) తప్పు అన్న ప్రకాశ్ రావు వాటిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు.. మగవాళ్ల నుంచే అన్యాయం జరుగుతోందని వివరించారు. ఆడవాళ్లను సపోర్ట్ చేయడం తన బాధ్యతని, శివాజీ అయినా, ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితువు పలికారు. శివాజీ సారీ చెప్పాడు, కానీ మిగతా వాళ్లు వదలరన్నారు. నేను మాట్లాడినా, కుటుంబ సభ్యులను లాగుతారన్నారు.

భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మాట్లాడే భాష బాగుండాలని సూచించారు. కచ్చితంగా శివాజీ మాట్లాడింది తప్పే అన్నారు. శివాజీ చెత్తగా మాట్లాడాడు.. ఆడవాళ్లపై అహంకారపు మాటలేంటి? అని ప్రకాశ్ రావు ప్రశ్నించారు. వేదికపై మాట్లాడుతున్నప్పుడు సంస్కారం ఉండాలి కదా అన్నారు. యాంకర్ అనసూయ(Anchor Anasuya) వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ సమర్థించారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశారు.. పైరసీ ముమ్మాటికీ తప్పే అన్నారు. టికెట్ ధర ఎక్కువ ఉందనిపిస్తే సినిమాలు చూడటం మానేయండని ప్రకాశ్ రాజ్ సూచించారు.

'దండోరా' సినిమా(Dandora movie) కార్యక్రమంలో మహిళల దుస్తులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి టాలీవుడ్ నటుడు శివాజీ శనివారం నాడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేవిగా, అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ కమిషన్ నోటీసు జారీ చేసింది. శివాజీ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, మహిళలను క్షమించమని కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చట్టం, 1998లోని సెక్షన్ 16(1)(బి) కింద మహిళా కమిషన్ విచారణను ప్రారంభించింది.