calender_icon.png 27 December, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా మీద ఇంత కుట్ర చేయాలా ?

27-12-2025 04:31:42 PM

హైదరాబాద్: 'దండోరా' సినిమా కార్యక్రమంలో మహిళల దుస్తులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి టాలీవుడ్ నటుడు శివాజీ(Tollywood actor Shivaji) తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేవిగా, అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ కమిషన్ నోటీసు జారీ చేసింది. శివాజీ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, మహిళలను క్షమించమని కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చట్టం, 1998లోని సెక్షన్ 16(1)(బి) కింద మహిళా కమిషన్ విచారణను ప్రారంభించింది.

మహిళా కమిషన్ విచారణ అనంతరం నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై కుట్ర జరుగుతోంది. నాతో కెరీర్ మొదలుపెట్టిన వారికి నాపై కోపం ఉందని శివాజీ సూచించారు. నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారని శివాజీ తెలిపారు. నాకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏం తప్పు చేశానని నా మీద ఇంత కోపం? అని ప్రశ్నించారు. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను.. సలహాలు ఇవ్వడం మానుకోవాలని అర్థమైందన్నారు. మహిళా కమిషన్ అడిగిన వాటికి సమాధానం చెప్పానని, విచారణ కోసం మహిళా కమిషన్ మళ్లీ పిలిచినా వస్తానని ఆయన చెప్పారు.