23 June, 2026 | 1:35 AM

ప్రీ ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది

23-06-2026 12:00 AM

నిజాంసాగర్, జూన్ 22 (విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రీ-ప్రైమరీ తరగతులను నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామం లో బాన్సువాడ ఆర్థివో రవీందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రీ-ప్రైమరీ తరగతి గదులను సందర్శించి చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. అనంతరం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమం లో పాల్గొని చిన్నారులకు పలకపై అక్షరాలు దిద్దించి వారి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు.

బాల్య విద్య చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. పిల్లల జీవితంలో తొలి అడుగు అత్యంత కీలకమైనది. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా చిన్నారుల్లో విద్యపై ఆసక్తి, సృజనాత్మకత, విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలం గాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది‘ అని అన్నారు. చిన్నారులకు బాల్యదశ నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు.

ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు గ్రామీణ ప్రాంత చిన్నారులకు ఎంతో మేలు చేస్తాయి‘ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా నాణ్యమైన విద్య అందించేం దుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు.   

హసిల్దార్   సాయి భుజంగారావు, ఎంపీడీవో  శివకుమార్, ఎంఈఓ తిరుపతిరెడ్డి, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ప్రజా పండరి, అచ్చంపేట్ గ్రామ సర్పంచ్, సంకు లక్స్నయ్య, నాయకులు, బంగ్లా ప్రవీణ్, రవీందర్, సేల్ రాజు,చాకలి సాయిరాం, ప్రసాద్, సాయిలు, సంతోష్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, లాల్ సింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.