11-01-2026 12:27:19 AM
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది రాజాసాబ్’. హారర్ ఫాంటసీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల కాగా, మిశ్రమ స్పందన వస్తోంది. ఈ మూవీటీమ్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో షో సరైన టైమ్‌లో పడలేదు. చాలా మంది ఇబ్బందిపడ్డారు. అందుకు క్షమించండి. ఏదేమైనా ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. మిడ్ రేంజ్ డైరెక్టర్ అయిన నాకు ప్రభాస్‌తో సినిమా చేశాననే క్రెడిట్ దక్కడం సంతోషంగా ఉంది. 9 నెలలకో సినిమా చేసే నేను మూడేళ్లు కష్టపడి ఈ సినిమా రూపొందించాను.
మేము చెప్పాలనుకున్న పాయింట్‌పై ఇంటలెక్చు వల్స్ ఒకలా మాట్లాడుతున్నారు.. అర్థం కాని వాళ్లు తిడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అప్పుడే సినిమా ఫలి తాన్ని నిర్ణయించొద్దు. కొత్త పాయింట్ ఎప్పుడైనా ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. ప్రభాస్ అభిమానుల సూచన మేరకు ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్‌ను యాడ్ చేశాం. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయి” అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “రాజా సాబ్’ తొలిరోజు మా అంచనాలు మించి రూ.112 కోట్లు వసూలు చేసింది. హారర్ ఫాంటసీ జానర్‌లో ఈ సినిమాను నిర్మించాం. కొందరి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అవన్నీ వదిలేస్తే సినిమా బాగా రన్ అవుతోంది” అని చెప్పారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులు మా సినిమాను ఇష్టపడుతున్నారు. ‘రాజాసాబ్’ సక్సెస్‌తో మేమంతా హ్యాపీగా ఉన్నాం” అని తెలిపింది. మరో కథానాయకి మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. “రాజాసాబ్’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ప్రభాస్ సరసన నటించాలనేది నా డ్రీమ్. అది ‘రాజాసాబ్’తో నిజమైంది. భవిష్యత్తులో మళ్లీ ప్రభాస్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నా” అని చెప్పింది. ‘సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మా మూవీని అప్రిషియేట్ చేస్తూ చాలా మెసేజ్‌లు వస్తున్నాయ’ని కథానాయిక రిద్ధికుమార్ తెలిపింది.