12-10-2025 07:59:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో ఈ రోజు స్థానిక ఎస్ఐ కృష్ణ రెడ్డి గ్రామ ప్రజలతో సమావేశమై పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణ రెడ్డి ప్రజలకు తెలియజేసిన అంశాలు:
• ప్రస్తుతం పంటల కోత సమయం కావున రోడ్లపై పంటలు వేసి ఎండబెట్టరాదు. రోడ్లపై పంటలు వేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
• సైబర్ నేరగాళ్లు ఇటీవల APK ఫైల్స్, అనుమానాస్పద లింక్స్ పంపుతూ మోసాలు చేస్తున్నారు. తెలియని లింక్స్ ఓపెన్ చేయరాదు, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయరాదని చెప్పారు.
• పంటలను అమ్మేటప్పుడు నమ్మకస్తులకే అమ్మాలని, మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
• ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్డు భద్రతను పాటించాలని అన్నారు.
ఎస్ఐ కృష్ణ రెడ్డి ప్రజల భద్రత, సైబర్ జాగ్రత్తలు, ఆర్థిక రక్షణపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు ఈ సూచనలను గమనించి పాటించాలని పిలుపునిచ్చారు.