20-09-2025 07:36:18 PM
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు, సంక్షేమాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ జీడి సారంగం, విహెచ్పిఎస్ పట్టణ అధ్యక్షులు రామ్ శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మున్సి పల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడిచినప్పటికీ వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టు కోలేదని వారు మండి పడ్డారు. వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పింఛన్ 6000 కు పెంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు మొత్తం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.