13 April, 2026 | 12:23 AM

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి

13-05-2024 12:54 AM

ప్రజలారా బహుపరాక్ !

ఓటర్లకు తెలంగాణ విద్యావంతుల వేదిక బహిరంగలేఖ

హైదరాబాద్, మే ౧౨: రాజ్యాంగాన్ని, సామాన్యుడి హక్కులను కాపాడే పార్టీలకే ఓటు వేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రకమిటీ పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ నేపథ్యంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అంబటి నాగయ్య ఓ ప్రకటన విడుదల చేశా రు. గత పదేండ్లలో పాలకుల పనితీరును గుర్తుంచుకొని, భవిష్యత్తు బాగుండేలా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

‘ఓటు మన నుంచి అధికారాన్ని బద లాయించే వాహకం మాత్రమే కాదు, మన స్వీయ రక్షణ హక్కు. ప్రజల జీవితాలను, స్వేచ్ఛను, ఆస్తిని ప్రభావితం చేసే చట్టాలను రూపొందించే చట్టసభను, ఆ చట్టసభ చేసే పీడక శాసనాల నుంచి పౌరుడిగా తనను తా ను కాపాడుకునే సహజ హక్కుగా కూడా ఇది ఉంటుంది. గత పది సంవత్సరాలుగా కేంద్ర పాలకులు వ్యక్తి విలువలను, వారి గౌరవ జీవితాన్ని ప్రజలనుంచి గుంజుకున్నది. అత్యాశాపరులైన సంపన్నుల కోసం అధికారాన్ని, సంపదలను కేంద్రీకరించింది.

నది లేనిచోట వంతెనను ప్రజలకు వాగ్దానం చేసే రాజకీయానికి, మూర్ఖత్వం దేశభక్తిగా చలామణీ చేస్తున్నవారికి మంచి ఉదాహరణగా నేటి ఈ కేంద్ర పాలకులు ఉండిపోతా రు. సంపన్నులు, స్పిరిచ్యువల్ ఫాసిస్టుల కోసం పేదవాడిని మరో పేదవాడికి శత్రువుగా మార్చింది. నిరుద్యోగాన్ని ఆల్ టైం రికార్డ్‌గా యువత కోసం బహుమతిగా ఇచ్చి ంది. కార్మికులను అదుపులో ఉంచి దోపిడీ చేసేందుకు, అభద్రతలో వారిని ఉంచేందుకు కార్మిక చట్టాలను తెచ్చింది. పేదలు వెనుకబడ్డ వారికి సంఘీభావం కోసం నిలబడ్డ ఆర్థిక వ్యవస్థను సంపన్నుల కోసం రీ-డిజైన్ చేసింది’ అని విమర్శించారు.

ఆర్థిక వ్యవస్థ కకావికలం

గత పదేండ్లలో కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, పేదవాడి జీవనం కకావికలం అయ్యాయని విద్యావంతుల వేదిక విమర్శించింది. ‘ప్రజలను అంధకారంలో ఉంచేందుకు కేంద్రం చరిత్రను అవహేళన రీతిలో వక్రీకరించింది. రాజ్యాంగం, స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పాటు అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 2013 భూసేకరణ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, పని హక్కు చట్టాలకు పూర్తిగా తూట్లు పొడిచింది. రాజకీయాల్లో ప్రజల పాత్రను కుదించేందుకు రాజకీయ పెట్టుబడి సిద్ధాంతాన్ని సూపర్ రాకెట్ వేగంతో అనుసరించింది.

ప్రజల ప్రాణాలను బలిపెట్టిన ఫార్మా కంపెనీల నుంచి అధికారిక ముడుపులు స్వీకరించి వాటిని కాపాడింది. తన విధానాలతో 5 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూసివేసింది. విమానాలు, రైలు, రోడ్డు మార్గాలు, పోర్టులను ఇప్పటికే కార్పొరేటుకు కట్టబెట్టిం ది. నవరత్నాలు, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ మొదల గు ఉన్నత సంస్థలను కూడా తన వారికి అప్పగించేందుకు రంగంలోకి దిగింది. ఈ పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రూపొందించిన అత్యంత మానవీయ విలువలు కలిగిన రాజ్యాంగం, రిజర్వేషన్లు, స్వాతంత్య్రోద్యమ విలువలు ఇకముందు ఉండవు. బానిస కాలానికి మనం మరింత దగ్గరవుతాం.

డేరాబాబా, బ్రిజ్ భూషణ్, ప్రజ్వల్ రేవన్నలు దేశమంతా అడుగడుగునా కనబడుతారు. నిజాయితీగా హిందూ తాత్వికతను అనుసరించిన స్వామి అగ్నివేశ్‌ని భౌతికంగా తొలగించిండ్రు. శంకరాచా ర్యులను కూడా అవహేళన చేసిండ్రు. అడవుల్లో ఖనిజాల కోసం ఆదివాసిలను సామూహిక హననం చేస్తున్నారు. అందుకే ఈ పాలకులను శిక్షించాలి. దశాబ్దాల పోరాటాలతో, వెలకట్టలేని త్యాగాలతో సాధించు కున్న తెలంగాణ ఆవిర్భావంపై పైశాచిక ప్రకటనలు చేస్తున్నరు. వీళ్లు ఇక్కడ కూడా తిష్ట వేస్తే మహోన్నత తెలంగాణ చారిత్రక వారసత్వం కుప్పకూలిపోతది. కావున ప్రజలారా రాజ్యాంగ దృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రకటిం చే విధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమస్ఫూర్తితో, దగాపడ్డ మట్టి మనుషుల కోసం మీ ఓటు ను వినియోగించండి’ అని పిలుపునిచ్చింది.