21 August, 2026 | 3:40 AM

సేంద్రీయ సాగుతో నేల ఆరోగ్య పరిరక్షణ

21-08-2026 12:00 AM

మొయినాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మొయినాబాద్ రైతు వేదికలో సేంద్రీయ వ్యవసాయం, నేల ఆరోగ్య పరిరక్షణ, వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయ నిపుణురాలు ఆది లక్ష్మి రైతులకు పంచగవ్య, బీజామృతం, జీవామృతం, వేప కషాయం తదితర సేంద్రీయ కషాయాల తయారీ, వినియోగంపై అవగాహన కల్పించారు.

రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరులతో సేంద్రీయ కషాయాలను తయారు చేసుకోవడం ద్వారా నేల సారాన్ని, పంటల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. పీజేటీఎస్‌ఏయూ రాజేంద్రనగర్కు చెందిన వాతావరణ సూచనల విభాగం రీసెర్చ్ అసోసియేట్ తరుణ్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం, వర్షపాతం మార్పులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులపై రైతులకు వివరి ంచారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్, మండల వ్యవసాయ అధికారి పి. అనురాధ, ఏఈఓలు శ్రీనివాస్, దీనా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కిసాన్ సంఘం నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.