11-09-2025 04:46:13 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం.. వేములవాడ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అక్టోబర్ 17 రోజున నరేంద్ర మోడీ పుట్టినరోజు ఉత్సవాల కొరకు సేవా పక్షం కార్యక్రమాల కార్యశాల సమావేశం నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ.. మోడీ పుట్టినరోజు ఉత్సవాలు 15 రోజులు పాటు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి పిలుపునిచ్చారు. ఎర్రం మహేష్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు దిక్సూచిగా. పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ, పుట్టినరోజు ఉత్సవాలు రక్తదాన శిబిరాలు చిత్రలేఖనం పోటీలు 2కే రన్ ప్రతి ఒక్కరం. అమ్మ పేరు మీద మొక్కలు నాటడం వంటి, కార్యక్రమాలు నిర్వహించి, పెద్ద ఎత్తున సంబరాలు. జరుపుకోవాలని తెలియజేశారు, ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ.. భారత ప్రధాని భారత నరేంద్ర మోడీ 75వ, పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఘనంగా, నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.