09-08-2025 02:59:32 AM
- 12 విభాగాల్లో ఎంపిక
- ఈ నెల 9 నుంచి 24 వరకు దరఖాస్తులకు అవకాశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): రౌండ్ టేబుల్ ఇండియా తెలంగాణలోని వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన అచీవర్స్, ఎమర్జింగ్ వ్యక్తులను సన్మానించేందుకు ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్సు 6వ ఎడిషన్‌ను ప్రకటిస్తోంది. ఈ సంవత్సరం 12 విభాగాలలో అవార్డులు ఇవ్వబడతాయి. కళలు మరియు సంస్కృతి, ఎన్జీవో, స్టార్ ఉమన్, స్టార్ కిడ్, వినోదం, విద్య, స్టార్ట్-అప్, హెల్త్ కేర్, ఫుడ్ అండ్ బేవరేజెస్, రిటైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్రీడలు. పైన పేర్కొన్న రంగాలలో విజయం పొంది మరియు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఒక అచీవర్ మరియు ఒక ఎమర్జింగ్ వ్యక్తిని సన్మానిస్తారు. ఈ నెల 9 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జ్యూరీ సభ్యుల వివరాలు
లక్ష్మీ నంబియార్, స్థాపకులు, సృష్టి ఆర్ట్ గ్యాలరీ, మీరా షెనాయ్, స్థాపకులు, యూత్ జాబ్స్, పి.రఘురామ్, స్థాపకులు, కిమ్స్ -ఉషాలక్ష్మి హాస్పిటల్, రాజ్ కందుకూరి, సినీ నిర్మాత మరియు దర్శకులు, ఎం.వి. రమణ, ముఖ్య కార్యనిర్వహణాధికారి, డా. రెడ్డీస్ ల్యాబ్స్, రమేష్ కాజ, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఐఓ, స్టేట్ స్ట్రీట్, సందీప్ సుల్తానియ, ఆర్థిక కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం, షాహ్ అజీమ్ హమీద్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఫెయిర్మౌంట్ బిల్డర్స్, శ్రీవిద్య రెడ్డి గుణంపల్లి, ఉపాధ్యక్షులు, నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, శ్రీనివాస రావు మహంకాళి, పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి, టి.హబ్.
టైటిల్ స్పాన్సర్ ఫెయిర్మౌంట్ బిల్డర్స్, మరియు ప్రిన్సిపల్ స్పాన్సర్ ఫ్రీడం ఆయిల్. రౌండ్ టేబుల్ ఇండియా 2024 ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ద్వారా నిధులు సమకూర్చి 4 కొత్త స్కూల్ బ్లాక్‌లను ప్రారంభిం చింది. వాటిలో జెడ్‌పీహెచ్‌ఎస్ అల్వాల్‌లో 2 తరగతి గదులు, ఎంపీపీఎస్ గర్ల్స్ మల్కాజ్గిరిలో 3 తరగతి గదులు, ఎంపీపీఎస్ అల్వాల్‌లో 2 తరగతి గదులు, ఎంపీయూపీఎస్ దేవరఫసల్వాద్‌లో 4 తరగతి గదులు నిర్మించారు. ఈసారి అవార్డుల వేడుక సెప్టెంబర్ 28 న నిర్వహించనున్నారు. పాల్గొనేవా రు తమను తాము లేదా ఇతరులను నామినే ట్ చేయడానికి www.prideoftelan gan a.com వెబ్‌సైట్, info@prideoftelanga na.com ఇమెయిల్ ద్వారా తమ ఎంట్రీలను సమర్పించవచ్చు.