09-08-2025 02:23:27 AM
పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఆనంద్ బాగ్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ వై ప్రేమ్‌కుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రవీందర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, వెంకటేష్ యాదవ్, బికే శ్రీనివాస్, గుండా నిరంజన్, డివిజన్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్ వినోద్ యాదవ్, సత్యమూర్తి, మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్, సంతోష్, రాందాస్ ముదిరాజ్, బాబు, సత్యనారాయణ, ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సానాది శంకర్ కుమార్, గణేష్, సురేష్ సింగ్, చారి, ఇస్తారీ, దేవేందర్ బ్రహ్మయ్య, బాలరాజు యాదవ్, యాదగిరి, రాము తదితరులు పాల్గొన్నారు.