09-08-2025 03:01:00 AM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 8(విజయక్రాంతి): కవాడిగూడ ప్రాంత నేపథ్యంతో కూడిన సినిమాను తీయడం అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సినిమా డైరెక్టర్, నిర్మాత, హీరో రవీంద్ర లేలిజాల నేతృత్వంలో “రాజుగాని సవాల్ “ అనే సినిమా సూపర్ హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ ప్రాంత నేపథ్యంతో కూడిన సినిమాను తీయడం పట్ల సినిమా హీరో, డైరెక్టర్, నిర్మాత రవీంద్ర లేలిజాలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచన శ్రీ, బిజెపి రాష్ర్ట నాయకులు జీ. వెంకటేష్, ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎం. రమేష్ రామ్, బిజెపి సీనియర్ నాయకుడు బండారు యాదగిరి, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు దిలీప్ యాదవ్, బిఆర్‌ఎస్ కవాడిగూడ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.