calender_icon.png 24 October, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిసాన్ కాపాస్ యాప్‌పై అవగాహన

22-10-2025 05:05:22 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కిసాన్ కాపాస్ యాప్‌పై బుధవారం మండలంలోని మోతుగూడెం గ్రామంలో ఏఈఓ రెహమాన్ కిసాన్ కాపాస్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిని అమ్ముకునే రైతులు తప్పనిసరిగా కిసాన్ కాపాసియాలో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతనే తమ పత్తిని సంబంధిత సీసీఐ జిన్నింగ్ మిల్లుకు తీసుకువెళ్లాలని సూచించారు, కిసాన్ కాపాస్ యాప్ ద్వారా తమ పూర్తి వివరాలు యాప్ లో పొందుపరిచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత ఏఈఓను సంప్రదించవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్ వినోద్ అన్నారావు తదితరులు పాల్గొన్నారు.