calender_icon.png 24 January, 2026 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి

24-01-2026 12:00:00 AM

బాన్సువాడ, జనవరి 23 (విజయ క్రాంతి): బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించిన ధీరుడు ఆజాద్ హింద్ ఫోజ్ వ్యవస్థాపకులు స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారిని  గజ గజలాడించిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రము ఊరికే రాదు మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం తెచ్చి ఇస్తానని చెప్పిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని దేశాన్ని కొరకు ఎంతటి త్యాగం అయిన చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్ పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ రామకృష్ణ మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ బిజెపి నాయకులు చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి కొండని గంగారం శంకర్ పంతులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూర్‌లో.. 

కామారెడ్డి అర్బన్, జనవరి 23(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భిక్కనూర్ ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానుభావుడు నేతాజీ అని కొనియాడారు. యువత నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.