17-09-2025 06:25:53 PM
దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్..
జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని 14వ వార్డ్ అంబేద్కర్ నగర్ పరిధిలో ఉన్న జెడ్పీపీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్ బాబు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ, పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం రోజున దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్‌పర్సన్ దూసరి ధనలక్ష్మి 14వ వార్డు తరఫున నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషి వల్లే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ బాబు సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు టి. జ్యోతి, జె. వాణి, ఎ. అరుణ జ్యోతి, వి. సంతోష్ కుమార్ లను కూడా అభినందించారు.ఈ కార్యక్రమంలో గన్ను కార్తిక్, వేణు గౌడ్, భాగ్యలక్ష్మి, బింగి విజయ, సుజాత, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందినీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.