calender_icon.png 17 September, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

17-09-2025 06:28:15 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు రజాకార్ల అకృత్యాలకు గోరి కట్టిన రోజు అని, నిజాం నిరంకుశ పాలనకు చిమర గీతం పాడిన రోజు అని, దొరల గడిలలోని బానిసత్వానికి సమాధి కట్టిన రోజని, లక్షలాది మంది ప్రజల గుండెల్లో వెలుగులు నింపిన రోజని, మువ్వెలా వెన్నెల జెండా నీడలో స్వేచ్ఛా వాయువులు పిలిచిన రోజని, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని, చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకముందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు లింగంపల్లి వంశీధర్ రావు,బల్ల శ్రవణ్, పూర్ణచందర్, సంతోష్, ఓడేటి బాల్రెడ్డి, కన్నెబోయిన ఐలయ్య, దడిగల వెంకటేష్, కొక్కు రాకేష్, పోత మనోజ్, దుర్గం పోచం, నేన్నెల రాకేష్, పేట సాయి తదితరులు పాల్గొన్నారు.