17-09-2025 06:25:14 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): విశ్వకర్మ నేటి వాస్తు శిల్పులకు ఆదర్శప్రాయుడని దైవిక వాస్తు శిల్పి అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రాల్లోని సమీకృత కలెక్టరేట్ లో జిల్లా బీసీ అధికారి సజీవన్ అధ్యక్షతన నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడన్నారు. ఆర్కిటెక్చర్ అభివృద్ధి చెందని సమయంలో గొప్ప నైపుణ్యంతో ఎన్నో రాజ భవనాలు నిర్మించిన గొప్ప నైపుణ్యకారుడని కొనియాడారు. ఇంజనీరింగ్ వృత్తిదారులకే కాకుండా చేతివృత్తి కళాకారులు కూడా ఈయనను అనుసరించారని అన్నారు. అటువంటి మహనీయుని జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.