calender_icon.png 28 January, 2026 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఆదివాసీల జాతర

28-01-2026 12:23:28 AM

నాగోబా హుండీ ఆదాయం రూ.20.74 లక్షలు

ఉట్నూర్, జనవరి 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసీల పండుగ నాగోబా జాతర ముగిసింది. ఈ నెల 18న నాగోబాకు మహా పూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు కొనసాగింది. నాగోబాకు డిసెంబర్ 22 న పూజలు ప్రారంభించిన మెస్రం వంశీయులు మంగళవారం గ్రామంలోని మురడి ఆలయంలో నాగోబాకు శుద్ధి పూజలు చేశారు. నాగోబా జాతర సందర్భంగా తై బజార్‌తో పాటు హుండీ లెక్కించడంతో రూ.20.74 లక్షల ఆదాయం వచ్చింది. తై బజార్ వల్ల రూపాయలు  11.81 లక్షలు, నాగోబా హుండీ ద్వారా 8.93 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు, మెస్రం వంశస్థులు, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు తెలిపారు.