07-04-2025 12:16:52 AM
విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్ పల్లి గ్రామంలోని దళితురాలి ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఎలా ఉన్నాయని కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం సరఫరాపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై బియ్యం కొనే ఆర్థిక భారం తప్పుతుందని చెప్పారు. దొడ్డు బియ్యం తినలేక సన్నాలు కొనేవాళ్లమని ఇప్పడు సర్కారే సరఫరా చేస్తుండడంతో ఆ బాధలు తప్పాయని వారు పేర్కొన్నారు.