calender_icon.png 15 May, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యకు తలాక్ చెప్పి ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

07-04-2025 12:18:31 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 6: కుటుంబ కలహాలతో భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి ఆమెకు తలాక్ చెప్పి అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్ వహీద్ కింగ్స్ కాలనీలో తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు.

ఈ క్రమంలో అతడు ఆదివారం భార్య, బిడ్డను బెల్టుతో చితకబాదాడు. ఆ తర్వాత భార్యకు తలాక్.. తలాక్ తలాక్ అని చెప్పాడు. అనంతరం వారిని బయటకు పంపించి చున్నితో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.