calender_icon.png 26 October, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను నిండా ముంచుతున్న రైస్ మిల్లర్స్

25-10-2025 08:10:36 PM

సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓ రైస్ మిల్లర్ తిరిగి పంపిస్తున్న వైనం... 

బొమ్మన్ దేవుపల్లి చౌరస్తాలో అగ్రహంతో  రైతుల రాస్తారోకో... ధర్నా... 

వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతు ఆత్మహత్యాయత్నం... 

ఎస్సై కాళ్లు మొక్కిన మరో రైతు... 

బాన్సువాడ,(విజయక్రాంతి): పుడమిని నమ్ముకున్న రైతన్న రోడ్డెక్కి తమను ఆదుకోవాలని ఆందోళన చేపట్టే పరిస్థితి ఎదురైంది. అన్నదాతలు అవస్థలపాలై రాస్తారోకో ధర్నాలకు దిగే స్థితికి రైతులు చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, నసురుల్లాబాద్ మండలంలోని  రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బొమ్మనిదేవుపల్లి చౌరస్తా వద్ద రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నినాదాలు చేస్తూ రైతులు తమ ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చారు. పరిస్థితి విషమిస్తున్న సమయంలో ఓ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయానికి పాల్పడ్డాడు. మరో రైతుల కష్టాల్ని పట్టించుకోవాలంటూ స్థానిక ఎస్సై కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన ఆందోళనలో రైతులు తమ సమస్యలను వివరిస్తూ, రైస్ మిల్లర్ వ్యవహారాలు చేస్తున్న మోసాలపై ఆరోపించారు.

లబోదిబోమంటున్న అన్నదాతలు...

పదిమందికి పట్టెడు అన్నం పెట్టే రైతన్న నేడు దిగాలుగా కూర్చున్నారు. ఇటు కురుస్తున్న అకాల వర్షాలు ఆరుగాలం కష్టించి పండించిన పంటను నీటిపాలు చేయడంపై కన్నీరు పెడుతున్నాడు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ రైస్ మిల్లుల వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లుల వ్యాపారులు నిరాకరించడంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. కురుస్తున్న వానలకు ఆరబెట్టుకున్న  ధాన్యం తడిసి ముద్ద కావడంతో వట్టి దాని కొనుగోలు చేసే విషయంలో రైస్ మిల్లర్ వ్యాపారులు ససిమిరా అనడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. శనివారం నసుల్లాబాద్ మండలం బొమ్మదేవిపల్లి చౌరస్తా వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

రాస్తారోకో ధర్నాకు దిగి రైస్ మిల్లర్లు వివరిస్తే తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కాయకష్టం చేసి పండించుకున్న పంటను అమ్ముకునేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు వివరిస్తున్న తీరును నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల రైస్ మిల్లర్ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు రైతుల నోట వెలుపెట్టాయి. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సూచించినప్పటికీ, రైస్ మిల్లర్ వ్యాపారులు మాత్రం ధాన్యం తడిసింది.. తరుగు అనే పేరిట అన్నదాతలను ఆగమాగం చేస్తున్నారు.

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు...

రైస్ మిల్ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైస్ మిల్లులకు వెళ్లిన రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నాను విమర్శలు వస్తున్నాయి. బొమ్మన్ దేవ్ పల్లి ప్రాంతంలోని రైతులు ఈ విషయంలో ఆగ్ర యించారు. ప్రభుత్వ సూచనలను పాటించాల్సిన రైస్ మిల్లర్ వ్యాపారులు బేఖాతార్ చేస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నారు. ఈ విషయమై రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఆందోళనకు రైస్ మిల్లర్ వ్యాపారులే కారణమని రైతులు పేర్కొంటున్నారు.

తడిసి ముద్దయిన ధాన్యం

పండించిన ధాన్యాన్ని రోడ్లపై రోడ్లపై ఆరబెట్టుకున్న రైతులు కురుస్తున్న అకాల వర్షాలతో లబో దిబో అంటున్నారు. ఆరబెట్టుకోవడం.. ఆపై వర్షం కురిసి తడిసిపోవడం జరుగుతోందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది అని రైతులు దిగాలి చెందారు. ప్రభుత్వం ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైస్ మిల్లర్లు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయడం ఎంత మటుకు సమంజసం అన్నారు.

రైతులను ఆదుకుంటాం... నస్రుల్లాబాద్  తహసిల్దార్ సువర్ణ...

వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మండల తహసిల్దార్ ఆందోళనలో పాల్గొన్న రైతులకు హామీ  ఇచ్చారు. ఈ విషయంలో రైస్ మిల్లర్లు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తహసిల్దార్ స్పష్టం చేశారు.

రైతులను  ఇబ్బంది పడితే ఊరుకోం.. బిజెపి నేత కొనాల గంగారెడ్డి...

రైతులను ఇబ్బంది పెట్టే విషయంలో రైస్ మిల్లర్లు తమ తీరును మార్చుకోకపోతే బిజెపి పార్టీ తరఫున ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బాన్సువాడ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడి తడిచిన దానిని కొనుగోలు చేసే ప్రక్రియలో బిజెపి అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.