28-01-2026 12:17:46 AM
ముషీరాబాద్, జనవరి 27(విజయక్రాంతి): ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025-26 క్రీడా పోటీల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ మహిళా కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎం.పి, డాక్టర్ కె. లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ హాజరైయ్యారు. మహిళా కబడ్డీ పోటీల్లో ముషీరాబాద్ కబడ్డి టీమ్ కెప్టెన్ మాధవి జట్టుపై హనుమాన్ టీమ్ గాంధీనగర్ కెప్టెన్ అనుష టీమ్ గెలుపొంది విజేతలుగా నిలిచారు. గెలుపొందిన విజేతలకు డాక్టర్ కె. లక్ష్మణ్ ట్రోఫీలను ప్రధానం చేసారు.
కార్పొరేటర్ ప్రశంసా పత్రాలను అందచేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయ లక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, కోవా రాహుల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.