28-01-2026 12:18:42 AM
రాజన్న సిరిసిల్ల, జనవరి 27 (విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్, దూస వినయ్ ,గౌడరాజు పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్,నాయకులు మండల సత్యం,గోవిందు రవి, ఆడెపు భాస్కర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి పార్టీలో చేరడం జరిగింది అన్నారు.పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.