2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ట్రై-కార్పొరేషన్లకు ఏకీకృత చట్టం!

14-03-2026 02:23 AM
  1. త్వరలో కొత్త క్యూర్ యాక్ట్

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరికి ఒకే నిబంధనలు

హైదరాబాద్, సిటీ బ్యూరో మా ర్చి 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర విస్తీర్ణం, జనాభా పెరుగు తున్న నేపథ్యంలో పరిపాలనను మరింత సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. క్యూర్ పరిధిలోకి వచ్చే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ఒకే ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని నిశ్చయించింది. ప్రస్తుతం విడివిడిగా ఉన్న జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఇకపై ఒకే చట్టం వర్తించనుంది.

ఈ మేరకు రూపొం దించిన నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ మహానగర పాలనలో సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ ట్రై-కార్పొరేషన్ యాక్ట్ రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ మూడు కార్పొరేషన్లకు వేర్వేరు నిబంధనలు ఉండటం వల్ల పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను విధింపు, అడ్వర్టై జ్మెంట్ పాలసీ, ఇతర పౌర సేవల విషయంలో మూడు చోట్లా ఒకే రకమైన నిబంధనలు ఉండాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి.