23-07-2025 12:00:00 AM
2018లో నాటి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ విధానంలో రూ.18 వేల గౌరవ వేతనంతో ఓపీఎస్ కార్యదర్శులను నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ఒక్కసారైనా, ఒక్క నెల అయినా సక్రమంగా వేతనలు అందిన దాఖలాలు లేవు. వారి ఉద్యోగాలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందనే ఆశతో వారు ఏడేళ్ల నుంచి తక్కువ జీతమైనా చేస్తున్నారు.
వీరికి విడుదలయ్యే రూ.18 వేల వేతనంలోనూ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కోతలు విధిస్తున్నది. ఏజెన్సీ తీసుకునే కమిషన్ రూ.450, జీఎస్టీ రూ.2,700, ప్రోబెషనరి చార్జీ రూ.150 పోగా, చివరికి సిబ్బందికి నెలకు రూ.14,850 మాత్రమే చేతికి అందుతున్నది. రెగ్యులర్ కార్యదర్శులతో వారు సమానంగా పనిచేస్తున్నా, గుర్తింపు లేదు. వారికి మంచి వేతనం అందడం లేదు.
సుధాకర్, హైదరాబాద్