23-07-2025 12:00:00 AM
విశ్వనగరంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణీకుల కష్టాలు వర్ణానాతీతం. ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే విద్యార్థుల పాసులు, సీనియర్ సిటిజన్లు 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా ఆర్డినరీ, మెట్రో-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించేలా వీలు కల్పించే టీ-24 పాసుల ధరలు పెంచడం, గతంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ౨ గంటల వరకు 50 రూపాయలతో ఉన్న పాస్ రద్దు కావడం అనేక మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది.
అత్యవసర సమయంలో ప్రైవేట్, ఆటో, క్యాబ్‌లలో వెళ్లాలంటే అవి బుక్ కాకపోవడం, బుక్ అయ్యే సమయంలో అగ్రిగేటర్లు అధిక చార్జీలు డిమాండ్ చేయడం వల్ల ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతుంది. రద్దీ లేని సమయంలో ఒక రేటు, రద్దీ సమయంలో మరో రేటు ఉండటం.
రాత్రి పూట ప్రత్యేకంగా ఛార్జీలు విధించడం ఎక్కడా లేని వెతలు తెస్తోంది. ప్రైవేట్, ఆటో, క్యాబ్‌లకు మీటర్లు లేక పోవడం ఎంత దూరానికి ఎంత చెల్లించాలని రవాణాశాఖ నిర్ణయించలేదు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్