22-09-2025 05:15:00 PM
డబల్ బెడ్ రూమ్ వద్ద వంటావార్పుతో నిరసన
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం పట్టణ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని డబల్ బెడ్ రూమ్ ల వద్ద లబ్ధిదారులు వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ లు మాట్లాడుతూ... గత పది నెలలుగా లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అనేక రూపాలలో ఆందోళన చేసిన అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
మౌలిక వసతులు కల్పన పేరుతో నిధులు కేటాయించి చేస్తున్న పనులు నత్తనడకన నడుస్తున్నాయని అన్నారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ రానున్నందున తక్షణమే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించినప్పుడే లబ్ధిదారులంతా వారితో కలిసి గృహప్రవేశాలు చేస్తారని ముందుగా ఇండ్లు కేటాయించి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. లేనియెడల ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చేంతవరకు నిరవధికంగా వంటావార్పు చేసుకుని అక్కడే ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.