22-09-2025 05:12:12 PM
రెబ్బెన,(విజయక్రాంతి): ఈ నెల 24 నుంచి 28 వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ లో జరగబోయే జాతీయ స్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రెఫ్రిగా రిక్కల వెంకట రామకృష్ణ ను నియమించినట్లు బాల్ బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా చీఫ్ రెఫ్రి జ్యోతిష్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కూడా అనేక జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఆల్ ఇండియా రిఫరీగా తన సేవలు అందించారు.
జాతీయస్థాయి పోటీలకు రెఫరీగా ఎంపికైనటువంటి రిక్కల వెంకట రామకృష్ణను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ పాట్రన్ ఆర్. నారాయణరెడ్డి, అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి , సెపక్ తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస రెడ్డి షార్ప్ స్టార్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వంగ మహేందర్, ప్రధాన కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉప్పులేటి శంకర్, పిఈటీ భాస్కర్ , చందర్, సీనియర్ క్రీడాకారులు హరిలాల్, బిమ్లా నాయక్, కే మల్లేష్, వి. సతీష్ ,రెడ్డి సతీష్, జి శ్రీధర్, పి చిన్ని, నరేష్, డి శ్రీనివాస్, సిద్దు,గోపాల్, శ్రీకాంత్ తదితరులు అభినందించారు.