4 April, 2026 | 7:30 PM

మొక్కజొన్న రైతులకు బాసట

04-04-2026 05:51 PM

- మద్దులపల్లి మార్కెట్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభం

కూసుమంచి,(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి మార్కెట్ లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనితతో కలిసి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శుభకార్యక్రమలకు హాజరు

అలాగే కూసుమంచి మండలం లోక్య తండా గ్రామంలో జరిగిన  పలు వివాహ వేడుకలకు తుంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారుడు దండి రామారావు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కూసుమంచి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.