4 April, 2026 | 7:22 PM

కల్లూరులో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ ర్యాలీ

04-04-2026 05:57 PM

ప్రేమ–క్షమాపణల సందేశంతో మార్మోగిన పట్టణం

కల్లూరు,(విజయక్రాంతి): పట్టణంలో ఎఐసిసి మండల కమిటీ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” ర్యాలీ నిర్వహించబడింది. యేసుక్రీస్తు ప్రేమ,శాంతి,క్షమాపణల సందేశాన్ని ప్రజల్లో విస్తరించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రేయర్ సెల్ అధ్యక్షులు రెవరెండ్ నిర్మల్ కుమార్ ప్రార్థనతో శ్రీకారం చుట్టారు. ఎన్ఎస్పి క్రాస్ రోడ్డు నుండి నూతన బస్టాండ్ వరకు సాగిన భారీ ర్యాలీలో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు.

ముఖ్య అతిథులుగా ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఏనోష్ కుమార్, ఆర్‌సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ సురేష్, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ భాస్కరరావు హాజరై రిబ్బన్ కట్ చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు యేసుక్రీస్తు బోధనలు మానవాళికి ప్రేమ, క్షమాపణల మార్గాన్ని చూపించాయని, ఆయన సందేశం ప్రపంచానికి శాంతి, సమాధానానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో దాసరి డేవిడ్ రాజు,రెవరెండ్ ఎబినేజర్, పీడీ దాసు, కెనడి రాజు, టి. సంజీవరావు, పెరుమాళ్ల దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, గౌడిపేరు జీవన్ కుమార్, రాజశేఖర్ తదితర నాయకులు, విశ్వాసులు పాల్గొన్నారు.