calender_icon.png 15 September, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి ఇంజినీరింగ్.. ప్రవృత్తి భూదందా

15-09-2025 01:11:03 AM

- నకిలీ స్టాంపులతో 70 ఎకరాలు కాదు, మొత్తం 225 ఎకరాలకు పేరు మార్పు 

- భూ బకాసురులపై కోర్టులో పలు కేసులు

- ఒక్కటి ఒక్కటి వెలుగు చూస్తున్న వైనం 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి):వృత్తి ఇంజనీరింగ్ ఉద్యోగం... ప్రవృత్తి భూకబ్జాలు... నకిలీ స్టాంపు పేపర్ల తో వెలుగు చూసిన వైనం. తాజాగా నకిలీ స్టాంప్ పేపర్లతో 70 ఎకరాల భూకబ్జాపై బో డు పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయం విధితమే. వాస్తవంగా నకిలీ స్టాంపు పేపర్లు, ఫోర్జరీ సంతకాలతో మొత్తం 225 ఎకరాలకు పైచిలుకు వ్యవసాయ భూమికి ఎసరు పె ట్టారా ప్రబుద్ధులు. ఇప్పటికే వారిపై కోర్టులో పలు కేసులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గం గారం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ భూ ములను కేటీపీఎస్ లో విధులు నిర్వహిస్తు న్న డి ఈ బలరాం, మరో జె పి ఏ రామ్ సిం గులు , స్థానికులతో ఒక ముఠాగా ఏర్పడి వ్యవసాయ భూముల కబ్జాకు తెర లేపారు.

భూ కబ్జా వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అ ప్పట్లోనే ఇంటెలిజెన్సీ సైతం భూ కబ్జాలపై ఆరా తీశారనీ సమాచారం. చివరకు పట్టాదారులను సైతం వదలకుండా భూక బ్జాకు పాల్పడటంతో అంశం వెలుగు చూసి కే సు నమోదు వరకు వచ్చింది. నకిలీ స్టాంపు పేపర్లతో ఆ ముఠా కబ్జా చేసింది సు మారు 225 ఎకరాలుగా తెలుస్తోంది. ఈ భూ కబ్జాకు టేకులపల్లి మండలం రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించి రిటైర్ అయిన డిప్యూటీ తాసిల్దార్ అండదండలు మెండుగా ఉన్నాయి. స్థానిక రాజకీయ నా యకుడు, మరో గిరిజన సంఘం నాయకుడితో బృందంగా ఏర్పడి భూకబ్జాకు శ్రీకా రం చుట్టారు. ఇప్పటికే పలు కేసులు కోర్టు లో కొనసాగుతున్నాయి వివరాల్లోకి వెళితే ఓ ఎస్ నెంబర్ 34/2025 మాలోత్ బలరాం, అబ్బినేని సాంబశివరావు, అభినేని అమ్మిల మధ్య సర్వేనెంబర్ 303/2/61/A A 12.08 ఎకరాల వివాదం కొనసాగుతోంది.

ఓ ఎస్ నెంబర్ 35/2025 లో మాలోత్ నాగలక్ష్మి, పులసాని భారతి,పులసాని నిరంజన్ మధ్య సర్వేనెంబర్ 303/ 2/105 లో 25 ఎకరాలు, ఓ ఎస్ నెంబర్ 81 /2025 లో కొమరం హైమావతి, వాగిరోతు రామ శివాజీ, ప్రసాద్ సర్వేనెంబర్ 303/2/61/A A లో 12.08 , ఓ ఎస్ నెం బర్ 80/2025 కొమరం చిట్టిబాబు, వాగిరోతు రామశివాజీ, ప్రసాద్ , సర్వే నెంబర్ 303/2/61/AA లో 37 ఎకరాలు. భద్రాచలం మొబైల్ కోర్టులోఓ ఎస్ నెంబర్ 133/2024 భూక్య బావసింగ్,వారణాసి లత, సర్వేనెంబర్ 303/2/84/10 లో 35 ఎకరాలు.ఓ ఎస్ నెంబర్ 134/2024 మాలోత్ బలరాం, వారణాసి లత, సర్వే నం బర్ 303/2/84/10 లో 35 ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్నాయి. ఇది అలా ఉన్నదా లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన సోమరాజు వెంకటరాజా రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులకు వారస త్వంగా వారి తాత నుంచి సంక్రమించిన టే కులపల్లి మండలం గంగారం రెవెన్యూ గ్రా మం పరిధిలో సర్వేనెంబర్ 303/2/157 లో 70 ఎకరాల భూమిని ఆక్రమించు కోవాలనే ఉద్దేశంతో నకిలీ స్టాంప్ పేపర్లను సృష్టించారనే ఫిర్యాదు మేరకు ఇటీవల బోడు పో లీస్స్టేషన్లో ఈనెల తొమ్మిదో తేదీన ఏడుగురి పై కేసు విషయం విధితమే.

భారీ లాబీయింగ్ ప్రయత్నాలు? 

తప్పుడు స్టాంపులతో భూ కబ్జాకు పాల్పడినట్లు కేసు నమోదైన బృందం ఒక వైపు రాజకీయ, మరోవైపు పెద్ద మొత్తంలో లాబీయింగ్ కు తెరలేపినట్టు విశ్వాసనీయంగా తె లుస్తోంది. ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి కేసు నుంచి భయపడేందుకు ప్రయత్నాలను ము మ్మరం చేసినట్టు ప్రచారం జోరు అందుకుం ది. దీంతో బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పోలీ స్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించి భూ కబ్జాదారుల అక్రమాలపై చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు.