calender_icon.png 15 September, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచిత్రం, విభిన్నం బొగ్గు రవాణా రోప్ వే..!

15-09-2025 01:07:21 AM

- సింగరేణి కీర్తి కిరీటంలో మరో అద్భుతం..

- బొగ్గుగనుల నుంచి హెవీ వాటర్ ప్లాంట్ కు నేరుగా రవాణా

- ప్రతినిత్యం మూడు వేల టన్నుల బొగ్గు రవాణాతో పరుగులు

- మోటారేతర రవాణాతో ముందడుగు

- బొగ్గు లారీల ప్రమాదాలకు చెక్ రవాణా భారం తగ్గుదల

- పర్యావరణ ప్రగతికి సోపానంగా నిలుస్తున్న సంస్థ సంకల్పం

మణుగూరు, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి) : బొగ్గు ఉత్పత్తిలో ఏరియా సింగరే ణి సంస్థకే తలమా నికంగా నిలుస్తూ, సంస్థ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నది. సమీప పరిశ్రమల థర్మల్ విద్యుత్ అవసరాలకు బొగ్గు ఉత్పత్తి చేస్తూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోంటుంది. రోడ్డు మార్గంలో లారీల ద్వా రా బొగ్గు రవాణా అత్యంత ప్రమాదకరం, పర్యావరణానికి హానికరం కావడంతో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు సమీ పంలోని హెవీ వాటర్ ప్లాంట్ కు బొగ్గు ర వాణా చేసేందుకు 80వ దశకంలో విభిన్న ఆలోచనతో రోప్ వే నిర్మాణాన్ని ప్రారంభిం చింది. సింగరేణి యాజమాన్యం చేసినప్రయ త్నం సఫలమైంది. దీంతో అటు పర్యావరణం పదిలంగా ఉండడం తోపాటు రహ దారులుఫై నిత్యం జరిగే లారీల ప్రమాదాలకు చెక్పడింది. రోప్ వే బొగ్గు రవాణాఏరియాచరి త్రతో పాటు సింగరేణి కీర్తి కిరీటం లో ఓ కలికితురాయిగా మారింది. దీనిపై విజయక్రాంతి అందిస్తున్న కథనం...

విచిత్రం, విభిన్నం రోప్ వే ..

పెట్రోల్, డీజిల్, అవసరమే లేదు. ఇంజన్ శబ్దాలు లేవు. డ్రైవర్లు మనసుల ఉం డరు, కానీ, టన్నుల కొద్దీ బొగ్గు రవాణా మా త్రం అక్కడ పరిశ్రమకు నిత్యం చేరుతుంది. రోప్ వే మార్గంలో బొగ్గుతో పెట్టెలు ఒకదాని వెనక ఒకటి క్రమం తప్పకుండా వెళ్తా యి. పక్క పక్క పయనించిన ప్రమా దాలు జరగవు. ఆ పెట్టెలకు బొగ్గును మోసుకెళ్ళే భారీ ఎలక్ట్రానిక్ చక్రం,ఎలక్ట్రానిక్ ఇనుప తా డు ఉన్నాయి. చక్రం పనితీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సింగరేణి సంస్థ చేప ట్టిన రోప్ వే అద్భుతమైన. దృశ్యాన్ని మణుగూరు నుండి పది కిలోమీటర్ల దూరంలోని హెవీ వాటర్ ప్లాంట్ కు నిత్యం బొగ్గు రవా ణా చేసే రోప్ వే మార్గం లో కనిపిస్తుంది. సింగరేణిలో కానీ రాష్ట్రంలో మరి ఎక్కడ ఇలాంటి బొగ్గు రవాణా దృశ్యం కనిపించదు.

మోటారేతర రవాణాతోముందడుగు..

లారీల్లో నిరంతరం బొగ్గు రవాణా తో ప్రమాదాలు చోటు చేసుకోవడం, తరలింపునకు ఎక్కువసమయం పడుతుండడం, ని త్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బ తినడం.. రోడ్లపై అక్కడ క్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ముపడడం వల్ల వాహనదారులకుఇబ్బందులు కలగడాన్ని దృష్టిలో పెట్టుకొని ప ర్యా వరణ రహిత మార్గమే శ్రేయస్కరమని సింగరేణి సంస్థ భావించింది.పర్యవరణానికి నష్టం కలగకుండా, సమీప ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా బొగ్గు రవాణా చే యాలన్న లక్ష్యంతో నిర్మిం చిన రోప్ వే మా ర్గం ద్వారా మోటారే తర బొగ్గు రవాణాతో ముందడు గు వేసింది.

ప్రమాదాలకు చెక్ రవాణా భారం తగ్గుదల..

ఇక్కడి సమీపంలోని హెవీ వాట ర్ ప్లాం ట్‌కు ప్రతి రోజు సుమారు 3 వేల టన్నులు బొగ్గు అవసరం పడుతుంది. బొగ్గును రవా ణా చేయాలంటే వందలాది లారీలు అనుని త్యం తిరగాల్సి ఉంటుం ది. అవి ప్రయాణిస్తున్న క్రమంలో దుమ్ము, ధూళి తో ప ర్యావరణంకు విఘతం కలుగుతుంది. రవా ణా పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే రోప్ వే ద్వారా బొ గ్గుసప్లై చేయడం ద్వారా రవాణాభారం తగ్గుతుంది. సమయం పని త్వరగా పూర్తవుతుం దని దీనిని నిర్మించారు అధికారులు.

ఇలా రోప్ వే ద్వారా సరఫరా అయినా బొగ్గు తో నే వాటర్ ప్లాంట్ లో విద్యుత్ ను ఉత్పత్తి చే స్తున్నారు. ఇతర అవసరాలకు వాడు కుంటున్నారు. ముందు చూపుతో ప్రారంభించి రో ప్ వే నిర్మాణంతో అటు పర్యావరణం పదిలంగా ఉండడంతో పాటుగా రహదారులు ఫై నిత్యం జరిగే లారీల ప్రమాదాలకు చెక్ ప డింది. బొగ్గు రవాణా పర్యా వరణానికి హాని కలగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా నిరాటంకంగా కొనసాగు తుంది.

పర్యావరణ హిత దిశగా ముందడుగు.. 

సంస్థ చరిత్రలో నిలిచిపోయే రోప్ వే మార్గం ఇది. సింగరేణిలో ఎక్క డా లేదు. ఈ మా ర్గంతో కెసిహెచ్పీ నుంచి బొగ్గు రవాణా నేరు గా హెవీ వా టర్ ప్లాంట్ కు సరఫరా అవుతున్నది. పర్యావరణం ఇప్పుడు చాలా బాగుంది. 

 దుర్గం రామచందర్ , ఏరియా సింగరేణి మేనేజర్