calender_icon.png 13 August, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మీ కోసం రక్తదాన శిబిరం

07-08-2025 01:37:46 AM

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటుచేసిన ప్రారం భ కార్యక్రమంలో అగ్ర నటుడు చిరంజీవి ముఖ్యఅతిథిగా, నటుడు తేజా సజ్జా, నటి సంయుక్త మేనన్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తేజ సజ్జా సహా 800 మంది రక్తదానం చేశారని, సేకరించిన రక్తా న్ని ఇండియన్ ఆర్మీకి అందజేయనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సంద ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “ఒక జర్నలిస్టు రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే నాకు బ్లడ్‌బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. రక్తదానం అనగానే నా పేరు స్ఫురించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నా.

విమర్శలపై నేనెప్పుడూ స్పందించను. నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే సమాధానం చెబుతుంది” అన్నారు. ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేశ్ చుక్కపల్లి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు.