25-09-2025 12:00:47 AM
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ డిమాండ్ చేసారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో నిర్వహించిన ఉద్యమకారుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 10 సంవత్సరాలు ఉద్యమకారులను మోసం చేసిందని ఆరోపించారు.
ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఎన్నో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మోసం చేస్తున్నదని శ్రీనివాస్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జిల్లా కేంద్రాలలో ఉద్యమకారుల కాలనీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కి 250 గజాల స్థలంతో పాటు అందులో పక్కా ఇల్లును నిర్మించి ఇవ్వాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి నెల 30 వేల పెన్షన్ ఇవ్వడంతోపాటు ఉద్యమకారుల తదనంతరం వారసులు అయిన భర్త గాని భార్య గాని పెన్షన్ ని కొనసాగించాలి.
ప్రతి ఉద్యమకారుడికి హెల్త్ కార్డును జారీ చేయాలి కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు మెరుగు మధు, బోనగిరి జిల్లా కన్వీనర్, భువనగిరి జిల్లా కో కన్వీనర్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మాల కృష్ణయ్య, ఉద్యమకారులు మంతపురి వినోద్‌కుమార్, ఊదరి బాలమల్లేష్ పాల్గొన్నారు.