25-09-2025 12:00:00 AM
జగదేవపూర్, సెప్టెంబర్ 24: రజక కులస్తులు ఆర్థికంగా ఎదగాలని గజ్వేల్ నియో జకవర్గం రజక సంఘం అధ్యక్షుడు రాచమ ల్ల ఎల్లేష్ కోరారు. ఉన్నత స్థాయిలో స్థిరపడి జాతికి సేవ చేయాలని సూచించారు. రజక సంఘం సభ్యులు సేవచేయడంలో ఇతరుల కు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.
జగదేవపూర్ మండలంలోని బస్వాపూర్ గ్రా మానికి చెందిన బసవరాజు శివయ్య (70) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందా డు. వి షయం తెలుసుకున్న ఎల్లేష్ సంఘం సభ్యులతో కలిసి శివయ్య కుటుంబాన్ని పరా మర్శించి రూ.5వేలు ఆర్థిక సహాయం అం దించారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం గౌరవ అధ్యక్షులు అక్కరం నర్సిం లు, నాయకులు వడ్లకొండ శ్రీనివాస్, రాచకొండ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.