calender_icon.png 25 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్‌లో శాస్త్రవేత్తల బృందం పర్యటన

24-09-2025 11:58:46 PM

సోయా – పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు 

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో రైతులు విస్తృతంగా సాగు చేసే సోయా విత్తనాలు, పప్పు దినుసుల విక్రయానికి ఇప్పటివరకు సక్రమమైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సంకల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  నియోజకవర్గంలో సోయా విత్తన ప్రాసెసింగ్ యూనిట్ మరియు పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముందుగానే కృషి చేశారు.

ఎమ్మెల్యే  ఆదేశాల మేరకు, బుధవారం పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ మద్నూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఇక్రిసాట్ శాస్త్రవేత్తల బృందం జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో పర్యటించింది. ఈ బృందంలో ఇక్రిసాట్ సీనియర్  ఆఫీసర్ తమిర్ సెల్వి, అసిస్టెంట్ మేనేజర్ ప్రియాంక, రీసెర్చ్ అసోసియేషన్ టీం మేనేజర్ రాజశేఖర్, సభ్యులు సురేష్ కుమార్, గంగారం స్థానిక నాయకులు సౌజన్య రమేష్  తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు పలు గోదాంలను పరిశీలించి, స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులు ఎదుర్కొంటున్న విక్రయ సమస్యలు తగ్గుతాయని, అదనంగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు.