calender_icon.png 1 July, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వద్దు

01-07-2025 12:46:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ 

రంగారెడ్డి, జూన్ 30( విజయక్రాంతి): రంగారెడ్డి కలెక్టరేట్ సముదాయ ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి (73 ) ఫిర్యాదులు అందినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి ఆర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.రెవెన్యూ శాఖ నుంచి 32, ఇతర శాఖలకు నుంచి 41, మొత్తం 73 దరఖస్తులుఅందాయి.